టీ 20 వరల్డ్ కప్: ఐర్లాండ్ పై గెలిచి బోణీ కొట్టిన ఆస్ట్రేలియా

Spread the love

టీ 20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాలుగు రోజులకు బరిలో దిగిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజాగా  గ్రూప్-బి మ్యాచ్ లో  ఐర్లాండ్ ను 67 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. మొదట ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. మార్కస్ స్టాయినిస్ 45 (29; 2×4, 1×6) రాణించాడు. జోష్ ఇంగ్లిస్ 37 (17; 6×4, 1×6), కామెరూన్ గ్రీన్ 21 (11; 1×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ లతో బ్యాట్ ఝళిపించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 2 వికెట్లు, మార్క్ అడైర్ 1 వికెట్, మెక్ కాతీ 1 వికెట్  తీశారు. ఛేదనలో ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. డాక్రెల్ 41 (29;3×4, 2×6) టాప్ స్కోరర్. టకర్ (24) పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నాథన్ ఎలిస్ (4/12), ఆడమ్ జంపా (4/23) విజృంభించారు.