సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఏదైనా మూవీ నచ్చితే దానిని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తుంటారన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. ఆయా మూవీ టీమ్ లను అభినందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ‘యుఫోరియా’ పై తాజాగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తప్పక చూడాల్సిన చిత్రమని తెలిపారు. దర్శకుడు గుణశేఖర్ గారు కదలు చెప్పే విధానంలో ఎప్పుడూ వైవిధ్యం ఉంటుంది. ‘యుఫోరియా’ని ఎంజాయ్ చేశా. ముఖ్యంగా క్లైమాక్స్” అంటూ.. ఈ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. పోక్సో చట్టం శక్తిని చాటి చెబుతుంది. సారా అర్జున్, భూమిక, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇక మహేశ్ గుణశేఖర్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మహేశ్ హీరోగా గుణశేఖర్ తెరకెక్కించిన ‘ఒక్కడు’ 2003 సంక్రాంతికి విడుదలై, ఘన విజయాన్ని అందుకుంది. అదే కాంబినేషన్లో ఆ తర్వాత ‘అర్జున్’, ‘సైనికుడు వంటి చిత్రాలు తెరకెక్కాయి.