స్టూడెంట్స్ కు ఏఐ యాక్సెస్:కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

Spread the love

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోకి క్రమంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఏఐ విధానాన్ని భారత్ లోని స్టూడెంట్స్ అందరికీ చేరువ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశంలో 30 కోట్ల మంది స్టూడెంట్స్  ఉన్నారని, 3వ తరగతి నుంచి అడ్వాన్స్డ్ రీసెర్చ్ లు నిర్వహించే స్టూడెంట్స్ వరకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ కాంక్లేవ్-2026 సదస్సులో ఆయన పాల్గొని ప్రసవించారు. ఏఐ సెక్టార్ లో  భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ మేధో సామర్థ్యానికి లోటు లేదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు  సంబంధించి పలు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్ లో  గణనీయమైన యువశక్తి ఉందన్నారు. ఏఐకి సంబంధించిన పరిశోధనలు, కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయడంలో టెక్ సంస్థలు పూర్తిగా నిమగ్నమయ్యాయన్నారు. ప్రస్తుతం ఏఐ మెషిన్ ఇంటెలిజెన్స్ తో పాటు మనుషుల ఎమోషన్స్ ను  కూడా అర్థం చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు.దీనిని  ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయమని కొనియాడారు. ఈ సమావేశానికి ముందు ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఎడ్క్ ఏఐ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 10 వినూత్న భారతీయ ఎక్స్టెక్ స్టార్టప్ ల ఫౌండర్స్ తో  ఆయన సమావేశమయ్యారు.