కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Spread the love

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఆయన తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం పై చర్చించారు. మామునూరు ప్రతిపాదిత విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయినందున వెంటనే  పనులు చేపట్టాలని కోరారు. కొత్తగూడెం ప్రతిపాదిత విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించామని,  OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు.  అంతర్గాం ప్రతిపాదిత విమానాశ్రయానికి  ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని  కోరారు.  ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, వెంటనే పనులు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.