టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. బలమైన జట్టైన ఆస్ట్రేలియాను జింబాబ్వే జట్టు ఓడించింది. కొలొంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన అస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ 64 నాటౌట్ (56; 7×4) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తడివనాషే మరుమని (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినీస్, కామెరూన్ గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19.3ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా 65 (44; 5×4, 1×6) రాణించాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (31) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజుర్బానీ 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. బ్రాడ్ ఇవాన్స్ 3 వికెట్లు, వెల్లింగ్టన్ మసకద్జా 1 వికెట్, ర్యాన్ బర్ల్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. అన్ని విభాగాల్లో జింబాబ్వే ఆస్ట్రేలియాపై పైచేయి సాధించి బంపర్ విక్టరీని సాధించింది.