ఎర్రంనాయుడు ప్రీమియర్ లీగ్ పేరుతో ఏటా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జరిగే క్రికెట్ పోటీల సీజన్ -9 కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భాగస్వామ్యం అయ్యారు. యువత ఉత్సాహం మధ్య, క్రీడల అవశ్యకతను వివరించేలా.. కాసేపు మైదానంలో క్రీడాకారుడిగా మారడం ఆనందాన్ని ఇచ్చిందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మొబైల్ కు బానిసలుగా మారడం కన్నా.. జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకోవాల్సిన అవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఈగల్ టీమ్ రూపొందించిన డ్రగ్స్ వ్యతరేక వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.