‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి క్రేజీ అప్డేట్ 

Spread the love

తెలుగు అగ్రకథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌ వచ్చే నెల 26న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి  ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా.. ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు మూవీ టీమ్  సిద్ధమైంది. ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్‌ఫుల్ యాంథమ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కినట్లు తెలుస్తున్న ఈ మూవీ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుందని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో కూడా మంచి ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన  పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ఎదుట భారీ జనసముద్రం కనిపించడం ఆకట్టుకుంటుండగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ -హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, పైగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్  అందిస్తుండటంతో ఈ సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.