డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాలి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

డాటా సెంట‌ర్ల‌కు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీల‌పై సమగ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు, వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం స‌మీక్షించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సాగుతున్న భూ సేక‌ర‌ణ‌పై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. భూ ప‌రిహారం నిర్ణ‌యించే విష‌యంలో ఉదారంగా ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. రైతుల‌ను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా ప‌రిహారం నిర్ణ‌యించాల‌ని పేర్కొన్నారు. రూ. వేల కోట్ల‌తో పెట్టుబ‌డులు పెట్టే సంస్థ‌లు భూమిపై పెట్టె పెట్టుబ‌డి చాలా స్వ‌ల్ప‌మ‌ని అన్నారు. కంపెనీల‌కు స‌కాలంలో భూమి, ఇత‌ర వ‌స‌తులు అందుబాటులో ఉంచితే త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేసుకుంటార‌ని తెలిపారు. ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *