చివరి సూపర్-8 బెర్తును సొంతం చేసుకున్న పాక్

Spread the love

టీ20 వరల్డ్ కప్ లో  చివరి సూపర్-8 బెర్తును పాకిస్థాన్ సొంతం చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-8కు దూసుకెళ్లింది.  రెండో బెర్తు పాక్ సొంతమైంది. గత మ్యాచ్ లో  భారత్ చేతిలో చిత్తయిన పాక్.. నమీబియాపై 102 పరుగుల భారీ విజయంతో లీగ్ దశను ముగించింది. పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ 100 (58; 11×4, 4×6) సెంచరీతో రాణించాడు. సల్మాన్ అఘా (38), షాదాబ్ ఖాన్ (36) పరుగులు చేశారు. అనంతరం నమీబియా 97 పరుగులకే ఆలౌటైంది. లౌరెన్ స్టీన్ క్యాంప్ (23), అలెగ్జాండర్ ఓల్సచెంక్ (20) మినహా ఎవరూ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 4 వికెట్లు, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో పాక్  సూపర్ 8 చేరింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *