టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ దశను భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుపులతో ముగించింది. గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్లో 17 పరుగుల తేడాతో నెదర్లాండ్ పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. శివమ్ దూబే 66 (31; 4×4, 6×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31), హార్దిక్ పాండ్య (30) పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 3 వికెట్లు, ఆర్యన్ దత్ 2 వికెట్లు, కైల్ క్లైన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ కూడా గొప్పగా పోరాడింది. బాస్ డీ లీడ్ (33) టాప్ స్కోరర్. జాచ్ లయన్-కాచెట్ (26), నోహ్ క్రోస్ (25), లెవిట్ (24), కోలిన్ అక్కెర్మెన్ (23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, శివమ్ దూబే 2 వికెట్లు, బుమ్రా, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది.