కోణార్క్ సూర్య దేవాలయం.. 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ద్వారాలు 

Spread the love

దాదాపు 122 ఏళ్ల తర్వాత ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతమైన ఒడిశా కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని ఇసుకను తొలగించి, దాన్ని పునరుద్ధరించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.13వ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడం లోని జగమోహన హాల్ (గర్భగుడి)లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే కీలక కార్యక్రమాన్ని భారత పురావస్తు సర్వే (ASI) చేపట్టింది. ఈ హిస్టారికల్ ప్రాసెస్  రానున్న మూడు నెలల్లో పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. 1903-04 సంవత్సరంలో బ్రిటిష్ ఆఫీసర్స్ ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడి, పగుళ్లు ఏర్పడటంతో, అది కూలిపోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి  ఈ హాల్‌లోకి భక్తులకు గానీ, విజిటర్స్ కు ప్రవేశం లేదు. కాగా, ప్రస్తుతం ఏఎస్ఐ, ఐఐటీ మద్రాస్ ఎక్స్పర్ట్స్ తో కూడిన 30 మంది సభ్యుల బృందం ఈ కఠినతరమైన  పనిని శాస్త్రీయ పద్ధతిలో చేస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆలయ గోడలకు ఎలాంటి నష్టం కలగకుండా ఇసుకను బయటకు తీస్తున్నారు. దేశంలో అత్యధికంగా టూరిస్ట్ లను  ఆకర్షిస్తున్న స్మారకాల్లో కోణార్క్ ప్రముఖమైనది. ఏటా లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *