ఎనర్జిటిక్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ ప్రోమో

Spread the love

తెలుగు అగ్రకథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌ వచ్చే నెల 26న విడుదల కానున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ -హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, పైగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్  అందిస్తుండటంతో ఈ సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి  ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా.. ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు మూవీ టీమ్  సిద్ధమైంది. ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్‌ఫుల్ యాంథమ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా, నేడు ఈ సాంగ్ ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇక ఈ మూవీ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుందని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో కూడా మంచి ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన  వీడియోలో పవన్ తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నారు.  ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *