తెలుగు అగ్రకథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే నెల 26న విడుదల కానున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ -హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, పైగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా.. ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు మూవీ టీమ్ సిద్ధమైంది. ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్ఫుల్ యాంథమ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా, నేడు ఈ సాంగ్ ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇక ఈ మూవీ భారీ మాస్ ఎంటర్టైనర్గా అలరించనుందని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో కూడా మంచి ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో పవన్ తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.