టీ 20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వే దూసుకుపోతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి గట్టి జట్టును మట్టి కరిపించిన జింబాబ్వే తాజాగా శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించి సత్తా చాటింది. కొలొంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంకా 62 (41; 8×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. పవన్ రత్ననాయకే 44 (25; 3×4, 2×6) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజార్బాని, బ్రాడ్ ఎవాన్స్, గ్రామీ క్రెమెర్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. ర్యాన్ బర్ల్ 1 వికెట్ తీశాడు. ఇక లక్ష్య ఛేదనలో జింబాబ్వే అదరగొట్టింది. 19.3ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. బ్రియాన్ బ్రెనేట్ 63 (48; 8×4) హాఫ్ సెంచరీ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శిఖందర్ రజా (45), మరుమని (34), ర్యాన్ బర్ల్ (23) ఆకట్టుకున్నారు. గ్రూప్-బి లో టాప్ జట్టుగా నిలిచింది.