ఘన విజయంతో టోర్నీ ముగించిన ఆఫ్ఘనిస్తాన్

Spread the love

టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ అదరగొట్టింది. కెనడాపై 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి నిష్క్రమించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇబ్రహీమ్ జద్రాన్ 95 నాటౌట్ (56; 7×4, 5×6) హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచాడు. సెదికుల్లాహ్ అటల్ (44), రహ్మతుల్లా గుర్బాజ్ (30) పర్వాలేదనిపించారు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు, డిలోన్ హెయిలిగేర్ 1 వికెట్ పడగొట్టారు. హార్ష్ థకేర్ (30), సాద్ బిన్ జాఫర్ (28)మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. మహమ్మద్ నబీ 4 వికెట్లతో రాణించాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు, ముజీబుర్ రెహ్మాన్ 1 వికెట్, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్ లో బాగా ఆడినా సూపర్-8 చేరలేకపోయిన ఆ టీమ్ ఈ మ్యాచ్ విజయంతో ఘనంగా ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *