ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీపైనా సమీక్ష నిర్వహించారు.