నిన్న జరిగిన ఏఐ (AI) సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన పని దిగ్భ్రాంతికి, తీవ్ర అసహనానికి గురిచేసిందని ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న, ఏఐ సూపర్ పవర్ గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ అంతర్జాతీయ వేదిక ఒక గొప్ప అవకాశం. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాజకీయ ప్రదర్శనగా మార్చడం ప్రపంచ దేశాల ముందు మన గౌరవాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ఇంతకంటే మెరుగైన గౌరవం దక్కాలని సంకుచిత రాజకీయాలకు అతీతంగా ఎదిగి, నవకల్పనలు మరియు అత్యుత్తమ ప్రమాణాల ద్వారా దేశ నిర్మాణానికి ప్రాధాన్యతనిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.