రజనీకాంత్, కమల్ హాసన్ అభిమానులకు సరికొత్త జోష్…స్పెషల్ వీడియోతో అలరిస్తోన్న స్టార్స్

Spread the love

తమిళ అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ లు 46 సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత కలసి వెండితెరపై సందడి చేయనున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు వంటి కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులకు ఆ మజానే వేరు. వీరిద్దరూ కెరీర్ ప్రారంభంలో ‘అపూర్వ రాగంగళ్’ సహా అనేక క్లాసిక్ చిత్రాల్లో కలిసి నటించారు.కోట్లాది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మల్టీ స్టారర్ కు ఇప్పడు రంగం సిద్ధమైంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. రజనీ,కమల్ ఇద్దరూ స్టయిలిష్ లుక్స్ తో అదరగొడుతున్నారు. 

రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఇద్దరూ అద్భుతమైన నటులు అయితే ఎవరికి వారే ప్రత్యేకం. రజనీకాంత్ తనదైన ‘స్టైల్’, మేనరిజమ్స్ మరియు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ సాగుతున్నారు.  ఆయన నటనలో స్వాగ్,  డైలాగ్ డెలివరీ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. మరోవైపు, కమల్ హాసన్ విలక్షణ పాత్రలతో, విభిన్న కళలలో టాలెంట్ తో  విశ్వనటుడిగా గుర్తింపు పొందారు. పాత్ర కోసం తన రూపాన్ని మార్చుకోవడమే కాకుండా, ఆ పాత్రలోని భావోద్వేగాలను అత్యంత లోతుగా పండించడంలో కమల్ ది ప్రత్యేక శైలి. రజనీకాంత్ ఒక పక్కా కమర్షియల్ సూపర్‌స్టార్‌గా ఎదిగితే, కమల్ హాసన్ ప్రయోగాత్మక చిత్రాలతో నటనలో కొత్త శిఖరాలను అధిరోహించారు. వీరిద్దరూ తమ విలక్షణమైన శైలులతో దశాబ్దాలుగా సినిమా సమమైన ఇమేజ్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *