
వెయిట్ గెయిన్ కన్నా.. వెయిట్ లాస్ అవ్వడంపై అందరీ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇష్టంగా ఫుడ్ తినప్పుడు.. తెలియకుండానే వెయిట్ పెరిగిపోతాం. తిరిగి తగ్గించడంపై ఎన్నో జిమ్ లు.. వాకింగ్, యోగాలు అంటే చేస్తాం. అసలుకైతే వెయిట్ తగ్గడం నిజంగానే సాధ్యమా..? సాధ్యమైతే పదిహేను రోజుల్లో 2 నుంచి 5 కిలోల బరువు తగ్గే చిట్కా మనకు తెలిసినదే అదేంటో ఇప్పుడు చూద్దాం..
‘ఇది శాస్త్రీయమా? ఆయుర్వేదం లేదా అలోపతి వైద్య విధానాలు సిఫారసు చేశాయా?’ అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే, దీని వెనక ప్రాచీన భారతీయ సంప్రదాయ రుజువులు కొన్ని ఉన్నాయి. కొన్ని తరాలవారు దాన్ని ఆచరించి మంచి రిజల్ట్ చూశాయి కూడా. అవసరమైనవాళ్లు ప్రయత్నించి చూడొచ్చు.
ప్రకృతి మనకు 32 దంతాల అమరికను ఊరకనే ఇవ్వలేదు. కానీ, మనం దాని ప్రయోజనాన్ని విస్మరిస్తున్నాం. జంతువులా ఆహారాన్ని గబుక్కున మింగేస్తున్నాం. దానివల్ల అది అరగటానికి ఎక్కువ శక్తిని వెచ్చిస్తున్నాం. జంతువులకు నెమరువేసుకునే వెసులుబాటు ఉంది. మనుషులకు ఆ సౌలభ్యం లేదు. కానీ ఆహారాన్ని బాగా నమిలి తింటే అది బరువు తగ్గటానికి ఉపకరించే మెథడ్ గా మారుతుంది. మీరు నోట్లో పెట్టుకునే ప్రతి ముద్దనూ దవడలకు రెండు వైపులకీ తీసికెళ్లి 32 సార్లు నమలాలి. ఆ తర్వాతే ఆహారాన్ని ఒక్క గుటకలో మింగేయాలట. సో ట్రై చేయండి.