ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పుడూ వారితోనే ఉంటాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని , మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని మోడీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుందని తెలిపారు.