ఐపీఎల్ 2026: బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధం!

Spread the love

ప్రతి సంవత్సరం వేసవిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఈ నెల 28 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా కూడా తమ తమ అభిమాన టీమ్ లను సపోర్ట్ చేసేందుకు తమ ఫేవరేట్ క్రికెటర్స్ ఈసారి ఏ రేంజ్ లో అదరగొడతారోననే అంచనాలతో ఐపీఎల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి సీజన్ లో వేడితో పాటు క్రికెట్ ఫీవర్ కూడా పెరిగి పోతుంది. ఈ ఏడాది కూడా మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఈ నెల 28 నుండి ఘనంగా ప్రారంభం కానుంది. మైదానాల్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించేందుకు, అభిమానులను ఉర్రూతలూగించేందుకు ప్లేయర్స్ నెట్స్ లో ప్రాక్టీస్ లో లీనమయ్యారు.  తమ అభిమానటీమ్స్ మైదానంలోకి ఎప్పుడు దిగుతాయా అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఇప్పటికే సందడి మొదలుపెట్టారు. దాదాపుగా రెండు నెలలకు పైగా జరిగే ఈ మెగా ఎంటర్టైనింగ్ లీగ్ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు తమ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు.  

ఈసారి ఐపీఎల్ వేలంలో చాలా జట్లు కొత్త ప్లేయర్స్  రాకతో టీమ్ కాంబినేషన్లు ఆసక్తికరంగా మారాయి. ఏ జట్టు ఏ వ్యూహంతో బరిలోకి దిగుతుందో, ఏ కెప్టెన్ తన స్ట్రాటజిలతో ఈ సారి  ట్రోఫీని కైవసం చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్నేషనల్ టీ 20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్  ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లను ఈ మెగా లీగ్ లో చూడాలని వారి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఐపీఎల్ లో ఎక్కువ కాలంగా కొనసాగుతున్న ఆటగాళ్లలో వీరు ముగ్గురూ ఉన్నారు. అందులో కోహ్లీ 18 సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ మరెవరికీ సాధ్యం కానీ రికార్డును నెలకొల్పాడు. మరే ప్లేయర్ అన్ని సంవత్సరాలు ఒకే ఫ్రాంచైజ్ కు ఆడలేదు. ఇక ధోని, రోహిత్ శర్మలు ప్లేయర్స్ గానే కాకుండా కెప్టెన్లుగా సరికొత్త రికార్డులు సృష్టించారు. ధోని 5 సార్లు, రోహిత్ శర్మ 5 సార్లు కెప్టెన్లుగా ట్రోఫీ అందుకున్నారు. ఇక రోహిత్ శర్మ మరొక అడుగు ముందే ఉన్నాడు. అతను 6 సార్లు ఐపీఎల్ గెలిచిన టీమ్ లలో ఉండడం విశేషం. ముంబై టీమ్ లో 5సార్లు 2009లో విన్నర్ గా నిలిచిన హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ టీమ్ లో ఒక సారి అతను ఉండడం విశేషం.  అలాగే ఈసారి యంగ్ క్రికెటర్స్ ఏ రేంజ్ లో అదరగొడతారోననే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో నిలదొక్కుకుంటున్న యంగ్ ప్లేయర్స్ ఈ మెగా టోర్నీని ఒక సువర్ణావకాశంగా  భావిస్తున్నారు. గత సీజన్ లో ఆడిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఏవిధంగా ఆకట్టుకున్నాడో చూశాం. ఆ విధంగా కొత్త క్రికెటర్లకు ఈ లీగ్ ఒక బిగ్ ప్లాట్ ఫామ్ గా నిలుస్తోంది.  ఈ క్రికెట్ యుద్ధంలో పది జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు, ముంబై ఇండియన్స్ 5 సార్లు, హైదరాబాద్ 2 సార్లు, కోల్ కతా నైట్ రైడర్స్ 3 సార్లు, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచుకున్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ లాంటి టీమ్స్ మొదటిసారి  కప్ ను గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ కొత్త సీజన్ లో ఆఖరికి ‘ఛాంపియన్’ గా ఏ జట్టు నిలుస్తుందో చూడాలి. లెట్స్ వెయిట్ ఫర్ మార్చ్ 28!  మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లు ఆడబోతున్నాయి. లాస్ట్ టైమ్ ట్రోఫీ గెలిచిన బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఇక హిట్టింగ్ కు మారుపేరుగా నిలిచే హైదరాబాద్ టీమ్ ఈ లీగ్ ను ఫస్ట్ మ్యాచ్ నుండే గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని దూకుడుమీద ఉంది. తెలుగు అభిమానులంతా ‘ఆరెంజ్ ఆర్మీ’ ఈసారి కచ్చితంగా కప్ కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. మొత్తానికి అన్ని టీమ్ లు ఈసారి మంచి జోరు మీద నువ్వానేనా అనే రేంజ్ లో ప్రిపేర్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *