అంగన్వాడీ చిన్నారులకు “తొలి ముద్ద” బ్రేక్ ఫాస్ట్ స్కీం..ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

అంగన్వాడీ చిన్నారులకు “తొలి ముద్ద” పేరుతో బ్రేక్ ఫాస్ట్ స్కీంను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ఆలోచనతో ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.  మా ఆలోచన ఎంత మంచిదైనా, అంగన్వాడీ లు దానిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అంగన్వాడీ లు మా ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు. వారి సమస్యల పై మాకు అవగాహన ఉంది. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు వచ్చినా మాకు మొదట గుర్తుకు వచ్చేది అంగన్వాడీ లే. వాళ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేచిన్న  పిల్లలకు ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన వేడివేడి అల్పాహారాన్ని అందిస్తారు. చిన్న వయస్సులోనే పిల్లలకు అవసరమైన సమతుల ఆహరం అందించడం ద్వారా వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *