అంగన్వాడీ చిన్నారులకు “తొలి ముద్ద” పేరుతో బ్రేక్ ఫాస్ట్ స్కీంను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ఆలోచనతో ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మా ఆలోచన ఎంత మంచిదైనా, అంగన్వాడీ లు దానిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అంగన్వాడీ లు మా ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు. వారి సమస్యల పై మాకు అవగాహన ఉంది. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు వచ్చినా మాకు మొదట గుర్తుకు వచ్చేది అంగన్వాడీ లే. వాళ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేచిన్న పిల్లలకు ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన వేడివేడి అల్పాహారాన్ని అందిస్తారు. చిన్న వయస్సులోనే పిల్లలకు అవసరమైన సమతుల ఆహరం అందించడం ద్వారా వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.