అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఎవరూ కదిలించలేని దిశగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్దత ప్రభుత్వ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-5కు సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంలో సెక్షన్-5 (2)లో “అమరావతి వద్ద” అనే పదాన్ని చేర్చడంతో పాటు, 2014 క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ అమరావతి పరిధిలోకి వస్తాయని స్పష్టమైన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ తీర్మానం ద్వారా రాజధాని విషయంలో గతంలో జరిగినవి పునరావృతం కాకుండా అమరావతికి పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.