భారతీయ చిత్రకళా రంగంలో అగ్రగణ్యుడుగా పేరొందిన చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన ఒక పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. యశోద మాత చిన్ని కృష్ణుడు ఉన్న ఆ పెయింటింగ్ ఏకంగా రూ.167.2కోట్ల ధరతో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని సాఫ్రాన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ నిన్న ముంబైలో జరిగింది. ఆక్షన్ లో రాజా రవి వర్మ గీసిన ఈ పెయింటింగ్ సొంతం చేసుకునేందుకు అనేకమంది పోటీపడ్డారు. అయితే ప్రముఖ ఇనుస్ట్రియలిస్ట్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దీనిని సొంతం చేసుకున్నారు. 1890లో గీసిన ఈ అద్భుతమైన పెయింటింగ్ ను రూ.167 కోట్లకు కొన్నారు. గత సంవత్సరం భారత్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ గీసిన ఒక పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుబోయి రికార్డు సృష్టించగా..ఇప్పుడు ఆ రికార్డును భారీ తేడాతో ఈ పెయింటింగ్ అధిగమించి సత్తాచాటింది. ఈ పెయింటింగ్ ను దక్కించుకోవడం పట్ల పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు.