2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి :ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేర్కొనే  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన ‘డయాఫ్రం వాల్’ నిర్మాణం పూర్తయ్యింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దీని నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేసి  నిర్మించినట్లు పేర్కొన్నారు.  డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయని వివరించారు.  ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని పునరుద్ఘాటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *