అమరావతి చట్టబద్ధతపై కీలక అడుగు…రాష్ట్రపతి వద్దకు బిల్లు 

Spread the love

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరింది. న్యాయ నిపుణులతో చర్చల తరవాత రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుకు చట్ట రూపం రానుంది. పార్లమెంటు ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లు 2026 నుఆమోదం తెలిపిన విషయం విదితమే. ఉభయ సభలైన లోక్ సభ, రాజ్యసభలలో ఈ బిల్లుపై చర్చల అనంతరం ఎటువంటి సవరణలు లేకుండానే ఆమోదం పొందాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన సహా అన్ని కీలక పార్టీలు  ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఇక ఈ రెండు సభల ఆమోదం అనంతరం బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ కు చేరింది. విభజనానంతరం రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఏపీ ప్రజలకు ఈ బిల్లు రాకతో ఇక రాజధానికి తిరుగులేదనే విశ్వాసం వ్యక్తమవుతోంది. అమరావతి ప్రాంత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *