భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘ధురంధర్-2’ 

Spread the love

మాములుగా కొన్ని సినిమాలు  బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలోనే భారీ కలెక్షన్లు సాధించి ఆ తర్వాత క్రమంగా జోరు తగ్గిస్తాయి. అయితే కొన్ని సినిమాలు  మాత్రం అంచనాలకు మించి ఎక్కువ వారాలు థియేటర్లలో విజయవంతంగా జోరును కొనసాగిస్తుంటాయి. అలాంటి అరుదైన విజయాన్ని ఇప్పుడు ధురంధర్-2 సినిమా అందుకుంది. విడుదలై మూడు వారాలు పూర్తయ్యే దశలోకి వచ్చినా ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ కొనసాగుతోంది. ప్రతి వారం కొత్త రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్నిసృష్టిస్తోంది. తాజాగా ఇంకో మైల్ స్టోన్ ను అధిగమించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రస్తుతం ఒక  ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. ముఖ్యంగా వీకెండ్ దగ్గరపడుతున్న సమయంలో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. వీకెండ్ మొదలయ్యేలోపే ఈ సినిమా ఒక అరుదైన ఘనతను సాధించింది. భారతదేశంలో అధికారికంగా వెయ్యి కోట్ల నెట్ వసూళ్ల క్లబ్‌లోకి ఈ చిత్రం అడుగుపెట్టింది. ఈ ఘనతను సాధించిన మొదటి బాలీవుడ్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఈ స్థాయి నెట్ కలెక్షన్లను భారత్‌లో సాధించిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ జాబితాలో ధురంధర్-2 కూడా చేరింది. దీంతో ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా హిందీ సినిమా పరిశ్రమకు ఇది ఒక గర్వకారణంగా భావిస్తున్నారు. ఈ సినిమా మొత్తంగా రూ.1622 కోట్లకు పైగా వసూళ్లను ఇప్పటివరకు సాధించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.394 కోట్లు వసూలు చేయగా..భారత్ లో రూ.1228 కోట్లు వసూలు చేసింది. నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో రూ.1000కోట్లు అధిగమించిన భారతీయ సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ధురంధర్ సినిమా ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు అన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే మంచి విజయం సాధించింది. అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తూ ధురంధర్-2 ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ, యాక్షన్, భావోద్వేగం అన్ని అంశాలు కలిసివచ్చి ఈ సినిమాను ఒక పెద్ద విజయంగా మార్చాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *