ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరింది. న్యాయ నిపుణులతో చర్చల తరవాత రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుకు చట్ట రూపం రానుంది. పార్లమెంటు ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లు 2026 నుఆమోదం తెలిపిన విషయం విదితమే. ఉభయ సభలైన లోక్ సభ, రాజ్యసభలలో ఈ బిల్లుపై చర్చల అనంతరం ఎటువంటి సవరణలు లేకుండానే ఆమోదం పొందాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన సహా అన్ని కీలక పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఇక ఈ రెండు సభల ఆమోదం అనంతరం బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ కు చేరింది. విభజనానంతరం రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఏపీ ప్రజలకు ఈ బిల్లు రాకతో ఇక రాజధానికి తిరుగులేదనే విశ్వాసం వ్యక్తమవుతోంది. అమరావతి ప్రాంత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.