పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

Spread the love

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న  భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం( భవ్య పథకం) కింద ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చలు జరిపారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై కూడా చర్చించారు. ఈ భేటీలో  మంత్రి టీ జీ భరత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పరిశ్రమలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాలు, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *