మనోళ్ల వాడకం…100 కోట్ల ఇమేజెస్..!

Spread the love

మనోళ్ల వాడకం మాములుగా ఉండదు…అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లు వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేరు అన్నట్లుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకోవడంలో భారతీయులు దూసుకుపోతున్నారు. ఓపెన్ ఏఐకు చెందిన ఇమేజ్ జెనరేషనల్ టూల్ ‘చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0ను మనోళ్లు భారీ స్థాయిలో వాడేశారు. ఈ ఇమేజ్ జెనరేషన్ టూల్ తో ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఇమేజెస్ ను క్రియేట్ చేశారని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మాన్ తెలిపారు. ChatGPT Images 2.0 ఇండియా. అక్కడ ఇప్పటికే 100 కోట్లకు (1 బిలియన్) పైగా ఇమేజెస్ క్రియేట్ చేయబడ్డాయి. ఇది చాలా అద్భుతంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఏఐ వినియోగం భారీగా పెరిగిందనేది తెలిసిందే. ఏది అసలైనదో, ఏది ఏఐ లో క్రియేట్ చేసారో తెలుసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక యువత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఏఐ తో జెనరేట్ చేసిన ఇమేజ్ లు తమ అకౌంట్లలో వాడుతున్నారు. ఇన్స్టా గ్రామ్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ కోసం పిక్స్, ఇంకా వారి ఫాంటసీ ఇమేజెస్, స్టయిలిష్ ఎడిట్స్ కోసం ఏఐ ఇమేజెస్ వాడుతున్నారు. దీంతో భారీగా వినియోగం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ చేసిన చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచి ఎడిటింగ్, వివిధ భాషల్లో వాడుకునే వీలు కలిగి ఉండడం, వైవిధ్యమైన లే అవుట్స్ వంటివి యూజర్స్ ను భారీగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ రేంజ్ లో వాడేస్తూ ఇమేజెస్ ను తయారుచేసుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *