మోక్షజ్ఞ మ్యాజిక్…తొలి సినిమాకే దిమ్మతిరిగే రెమ్యునరేషన్

బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ మూవీ అనౌన్స్‎మెంట్ రాగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మోక్షజ్ఞ‎ను హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఎక్కడా తగ్గేదేలే అంటూ ఫస్ట్ మూవీతోనే రికార్డు క్రియేట్ చేసేస్తున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ కొత్త హీరో తీసుకోలేని విధంగా మొదటి సినిమాకే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ అదరగొట్టేస్తున్నాడు. సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. బాలయ్య బాబు బ్యాక్ బోన్ కావడం వల్లే నిర్మాతలు మోక్షజ్ఞకు అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారా? ఇంతకీ మోక్షజ్ఞ రికార్డు పారితోషికం ఎంతో తెలుసా…? లెట్స్ వాచ్..

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం‎లో మోక్షజ్ఞ మూవీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ రెడీగా ఉన్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్నాయి. మొన్నటి వరకు బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు ఫిట్ బాడీతో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. స్టార్ హీరోలను బీట్ చేసే స్టన్నింగ్ లుక్‌లో మోక్షజ్ఞ కనిపిస్తున్నాడు. కుర్రాడు కత్తిలా ఉన్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞను తెగ పొగిడేస్తున్నారు.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. మొదట్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సీనియర్ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ ఛాన్స్ ప్రశాంత్ వర్మకు దక్కింది. సింబా అనే టైటిల్‎తో భారీ బడ్జెట్‎తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. దీంతో మోక్షజ్ఞ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణ తీసుకున్నారంట. యాక్టింగ్, డాన్స్ పరంగా మంచి టాలెంట్ ఉందనే మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం మోక్షజ్ఞకి నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన ఏ ఒక్క హీరో కూడా డెబ్యూ మూవీకి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదట. దీంతో మోక్షజ్ఞ ఈ విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు స్టార్ హీరోల వారసులు ఎవరు ఎంట్రీ ఇచ్చినా వారి రెమ్యునరేషన్ కోటి, రెండు కోట్లకు మించి లేదు. కొంత మంది హీరోలు ఫస్ట్ మూవీకి ఎలాంటి పారితోషికం ఆశించేవారు కాదట. సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ అయ్యాకే లాభాల్లో ఎంతో కొంత మొత్తం రెమ్యునరేషన్‌గా తీసుకునేవారట.. కానీ, మోక్షజ్ఞ మాత్రం అందరికీ భిన్నంగా తన ఫస్ట్‌ సినిమాకే 20 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిని అందుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కొత్త హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా ఇంకా ఆ రేంజ్‌ రెమ్యునరేషన్ ను చేరుకోలేదంటున్నారు. కానీ మొదటి సినిమాకే భారీ మొత్తంలో తీసుకుంటుండటంతో మోక్షజ్ఞ రికార్డు సృష్టించాడని అంటున్నారు. అయితే మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది క్లారిటీ లేదు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఫస్ట్ మూవీకే అంతిస్తున్నారా? అంటూ ఆశ్చ‌ర్య‌ం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంద‌రు అందంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీకి బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని, సుధాకర్ చెరుకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా తేజస్విని కూడా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ అండ్ క్రూని ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో మోక్షజ్ఞకి జోడీగా ఎవరిని సెలెక్ట్ చేస్తారనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‎లో పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ప్రశాంత్ తీసే సినిమా కావడంతో ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే…