ఇంటర్ రద్దు వెనుక అసలు కారణమిదే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థను రద్దు చేయనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విద్య వ్యవస్థపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ రద్దు, ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన.. వంటి కొత్త విధానాలను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తరగతుల విషయంలో కూడా కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అయితే ఇంటర్ రద్దు చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహమేంటి? ఇలా చేస్తే ఏమైనా లాభం ఉందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

విద్యావ్యవస్థకు ప్రతి ఏటా వేల కోట్లు ఖర్చవుతుంది. పాఠ్య పుస్తకాల పంపిణి, స్కూల్ లో మౌలిక వసతులు.. ఇతరత్రా అవసరాలు ఇలా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న అంశమే. అందుకే 2024-25 వార్షిక బడ్జెట్‌లో విద్యావ్యవస్థకు ఏకంగా 21,292 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. అందుకే ప్రభుత్వం ఖర్చులను తగ్గించేందుకే విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

2020లో అమల్లోకి వచ్చిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీపై సమగ్ర విశ్లేషణ చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఇంటర్ వ్యవస్థను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటివరకు స్కూల్ వ్యవస్థ, ఇంటర్మీడియట్ వ్యవస్థ వేర్వేరుగా కొనసాగుతూ వచ్చాయి. ఇకపై ఆలా కాకుండా స్కూల్ పరిధిలోనే ఇంటర్ తరగతులను నిర్వహిస్తే పర్యవేక్షణ సులభతరం కావడంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అంతే కాకుండా కార్పొరేట్ ఇంటర్ కాలేజీల అక్రమ దోపిడీని కూడా అడ్డుకోవచ్చని భావిస్తోంది. మరి ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుందనే విషయం తెలియాలంటే మరింకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.