కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ తయారీపై వస్తున్న వార్తలు ఉన్నాయన్నారు ప్రముఖ జ్యోతిష్యపండితులు శ్రీరామచంద్రమూర్తి. తిరుమలకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని సేవించుకుంటారని ఆయన గుర్తు చేశారు. ఇలా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో అపచారం జరిగిందన్న వార్తలు రావటం తమను కలిచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవటం ఒక్కటే మార్గమని చెబుతున్న శ్రీరామచంద్రమూర్తి.