చంద్రబాబు, పవన్ ఘనత అదే-చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీలో 100 రోజుల కూటమి పాలనపై పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఈ రాష్ట్రాన్ని 100 రోజుల్లో ఎంతగానో సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు మూడు వేలతో కలసి ఏడు వేల రూపాయలను మొదటి నెల ఒకటవ తారీఖునే ఇచ్చామన్నారు. దీపావళికి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని, తొందరలోనే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నామని, సంక్రాంతికి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.