నూర్ బాషాలకు అండగా ఆ పల్నాడు ఎమ్మెల్యే.. ! బాబు, పవన్ కు పాలాభిషేకాలు..

రాష్ట్రంలో నూర్ బాషాలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆహ్వానించారు.సీఎం చంద్రబాబు నూర్ బాషాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాచర్ల నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి , చంద్రబాబు, పవన్ ఫొటోలకు ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాలాభిషేకం చేశారు, మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు