వాళ్లు క్రిస్టియన్లేగా-డిక్లరేషన్ ఇవ్వు..!పవన్ కు మాజీ డిప్యూటీ సీఎం డిమాండ్..!

తన భార్య పిల్లలు క్రిస్టియన్లని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ప్రభుత్వ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర ముగించుకుని తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్ లో సంతకం చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.కొత్తగా డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని అడగడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.