తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అపరాధం జరిగిందన్న వార్తల నేపథ్యంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఏలూరు జనసేన నేత నారా శేషు తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కు సంఘీభావంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న సన్నిధిలో ఆయన వారం రోజుల దీక్ష చేపట్టారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల స్వామివారి లడ్డు నాణ్యత పూర్తిగా దెబ్బతిందని, తప్పు చేసిన వారి ఎంతటి వారైనా క్షమించకూడదని ప్రభుత్వాన్ని కోరారు.