తిరుపతి కార్పోరేషన్ ఆఫీసు శుభ్రం చేసిన అధికారులు-ఎందుకో తెలుసా ?

తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛతాహీ సేవలో భాగంగా అధికారులు చీపుళ్లు చేతబట్టి కార్యాలయాన్ని శుభ్రం చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కమిషనర్ స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు.