జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వల్లే తిరుమలకు చెడ్డ పేరన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే ధైర్యం లేకనే జగన్ తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే జగన్ కి రోషమెందుకని ప్రశ్నించారు. తిరుమల సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే అన్నారు. లడ్డు ప్రసాదం కల్తీ పాపం ఊరికే పోదని, భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన జగన్ ని ఆ దేవుడే శిక్షిస్తాడని జీవీ తెలిపారు. జగన్ క్రైస్తవుడు కాదు నాస్తికుడని, క్రైస్తవ పాస్టర్లను కూడా జగన్ మోసం చేసాడని ఎమ్మెల్యే ఆరోపించారు.