టీటీడీ పని చంద్రబాబు, పవన్ చేస్తారా ? కాకాణి ఫైర్..!

ఏపీలో ఎప్పుడూ లేని విధంగా వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణలు రావడం దురదృష్టకరమని వైసీపీ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. వెంకటేశ్వర స్వామి మీద, స్వామివారి కైంకార్యాల మీద అసత్యాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసినట్లు కాకాణి తెలిపారు. వక్రబుద్ధి నుంచి చంద్రబాబు కు మంచి బుద్ధి రావాలని స్వామిని కోరామన్నారు. నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే టీటీడీ బయట పెట్టాలి కానీ టిడిపి కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్,పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని కాకాణి ప్రశ్నించారు