చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం వేంకటేశ్వర స్వామిని లాగుతున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కల్తీ నెయ్యి వాడలేదని తెలిసీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జగన్ ను ఎదుర్కునే ధైర్యం లేదని, తల్లి తండ్రులు అంటే భయం లేదని, దేవుడు అంటే భక్తి లేదని విమర్శించారు. అతి కొద్ది రోజుల్లో మళ్ళీ జగన్ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారని, అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తామన్నారు..