గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొరిటిపాడు సెంటర్లోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళన జరగాలని కోరుతూ మాజీ మంత్రి విడదల రజిని పూజలు నిర్వహించారు.కూటమి ప్రభుత్వం రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని ఆమె తెలిపారు. వంద రోజులు పాలనలో ఏంచేయలేకపోయారని, దాన్ని పక్కదారి పట్టించేందుకు అపవిత్రం అంటూ ప్రచారాలు చేస్తున్నారనీ విమర్శించారు. సమాజానికి ఇటువంటి ప్రచారం మంచిది కాదన్నారు.