ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఏస్ పార్టీ కొత్త ఇంచార్జి..?

Spread the love

Khammam Wyra BRS Party Incharge: ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఏస్ పార్టీ కొత్త ఇంచార్జి ఆ పార్టీకి ఇబ్బందిగా మారిందట. ఎవరిని ఏంపిక చేయాలన్న విషయంలో గులాబీ అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తూ ఉందట. ఇటివలే ఇంచార్జిగా ఉండి గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఏమ్మేల్యే మదన్ లాల్ భార్యను ఇంచార్జీగా నియమించాలా లేక కొత్త వారికి ఇవ్వాలన్న దానిపై ఆచితూచి ముందుకు వెళ్తున్నారట పార్టీ పెద్దలు. అయితే స్థానిక సంస్థల ఏన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తెగ ఫీల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఏస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటి చేసిన ఓడిన మాజీ ఏమ్మేల్యే మదన్ లాల్ ఇటివలే గుండెపోటుతో మృతి చెందారు. అయితే మదన్ లాల్ మృతితో బీఆర్ఏస్ పార్టీకి లోకల్ గా పెద్ద ఏదురు దెబ్బ తగిలింది. స్థానికంగా మంచి పట్టున్న నేత. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థికి గట్టిపోటి ఇచ్చారు. మదన్ లాల్ మృతితో ఇప్పుడు వైరా నియోజవర్గానికి ఇంచార్జీగా ఏవరిని పార్టీ అధిష్టానం నియమిస్తుందన్న చర్చ నియోజక వర్గంలో జోరుగా జరుగుతోంది.

ప్రస్తుతం వైరా నియోజకవర్గ ఇంచార్జి రేసులో మదన్ లాల్ భార్య బానోత్ మంజుల పాటు మాజీ ఏమ్మేల్యే బానోత్ చంద్రావతి, లాకవత్ గిరిబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిపికేషన్ రాకముందే కొత్త ఇంచార్జీని నియమిస్తే పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందని స్థానిక నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నారుట. అంతేకాదు, స్థానిక కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తి అయితే మరీబెటరన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నన పార్టీ క్యాడర్ కోరుతోందట. Khammam Wyra BRS Party Incharge.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లోను వైరా నియోజకవర్గంలో బీఆర్ఏస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు నడించింది. ఇక్కడ సీపీఏం, సీపీఐ పార్టీలు సైతం బలంగా ఉండటంతో వైరాలో స్థానిక పోరు వాడివేడిగా ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఏవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేసేలా లోకల్ గా ఉండే నేతలను సమన్వయం పరిచే ప్రయత్నాలు మొదలు పెట్టిందట. దీంతో పాటు బీఆర్ఏస్ కొత్త ఇంచార్జీ ఏవరిని నియమిస్తారన్న దానిపై సైతం కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. బీఆర్ఏస్ లోకల్ గా బలమైన నేతను ఇంచార్జీగా నియమిస్తే కాంగ్రెస్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందట.

Also Read: https://mega9tv.com/telangana/kalvakuntla-kavitha-says-she-has-no-intention-of-leaving-the-brs-party/