
BRS party Kalvakuntla Kavitha: తానేమో బీఆర్ఎస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదంటారు. కానీ పార్టీ కేడర్ మాత్రం దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆమె సొంత జనం మినహా, పార్టీ కేడర్ మాత్రం కనిపించడం లేదట. దీంతో సొంత పార్టీ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఆమె తెలంగాణ మొత్తం చుట్టేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత కామెంట్స్ గుబులు పెట్టిస్తున్నాయి. తనకు కేసీఆర్ తప్పా మరో నాయకుడు లేడన్న ఆమె కామెంట్స్ బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర చర్చకు దారితీసాయి. ఆమె ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిమానులకు కవితా కామెంట్స్ రుచించడం లేదట. అందుకే కవితను కారు పార్టీకి చెందిన ప్రధాన లీడర్లు దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక కవిత కూడా ఏదో ఒక కారణంతో తెలంగాణాలోని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల ఆమె పర్యటించారు. ఇటీవల మరణించిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అలాగే మరో బీఆర్ఎస్ మరో నేత కుటుంబ సభ్యులను కూడా ఆమె పరామ్శించారు. ఆ సమయంలో కవితా వెంట బీఆర్ఎస్ లీడర్లు కనిపించలేదు. జిల్లాలో ప్రధాన నాయకులుగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి,సండ్ర వెంకట వీరయ్య, కమల్ రాజ్ రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, కవిత పర్యటన వైపు కన్నెత్తి చూడలేదు. అంతకు ముందు ఆ నేతల్లో ఒకరిద్దరు జిల్లాలో ఉన్నా కవితాను మాత్రం పట్టించుకోలేదు. మాజీ సీఎం కూతురు, పైగా పార్టీ ఎమ్మెల్సీ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పట్టించుకోకపోవడంతో కవితను పార్టీనే దూరం పెట్టిందనే టాక్ వినిపిస్తుంది. ఆ క్రమంలోనే పార్టీ ఆదేశాలతోనే కవితా పర్యటనలో వారు పాల్గొనలేదనే ప్రచారం నడుస్తోంది. BRS party Kalvakuntla Kavitha.
అయితే బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కవితకు బీఆర్ఎస్ లోని పలువురు బీసీ నేతలు మద్దతు పలికారు. ఇతర ఏ సామాజిక వర్గ నేతలను కవిత అస్సలు పట్టించుకోలేదట. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జాగృతి బలోపేతం కోసం కృషి చేస్తానని చెబుతున్న కవిత, ఆ సంస్థనే పార్టీగా అనౌన్స్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్క బీసీ నేతలే ఆమె వెంట కనిపించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన లీడర్లు అంతా కేటీఆర్ కనుసన్నల్లో పనిచేసేవారే అనే టాక్ ఉంది. కవిత పర్యటనకు సంబంధించి ఎవరూ కూడా హాజరు కావద్దని జిల్లా నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే జిల్లా పర్యటనలో ఈ అంశాలు అన్ని గమనించిన కవిత, ఆ లీడర్లు వ్యవహార తీరును ఆరా తీస్తున్నారట. మొత్తానికి కవిత ఖమ్మం జిల్లా పర్యటన నయా రాజకీయ సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: https://mega9tv.com/slideshow/telangana-cm-revanth-reddy-appreciating-communist-leaders/