శ్రీశైలం నియోజకవర్గ రాజకీయాలు…!

Spread the love

Srisailam TDP vs YSRCP: శ్రీశైలం నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ, వైసీపీ నేతలు నియోజకవర్గంలో తెగతిరుగుతున్నారట. అభివృద్ధి పేరుతో ఒకరు, వెన్నుపోటు పేరుతో మరొకరు నియోజకవర్గం చుట్టేస్తున్నారట. దీంతో శ్రీశైలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్తితి ఏర్పడిందట.

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం శ్రీశైలం నియోజకవర్గంలో కూటమి పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తుంటే, బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ పేరుతో వెన్నుపోటు దినోత్సవం అంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు వైసీపీ నేతలు. దీంతో శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఛాలెంజ్ రాజకీయాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలరోజుల నుంచి నియోజకవర్గంలో ప్రజా అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం అమలు చేసే పథకాలను టీడీపీ నేతలు వివరిస్తున్నారట. ముఖ్యంగా నియోజకవర్గంలోని బండిఆత్మకూరు, మహానంది, వెలుగోడు, శ్రీశైలం, సున్నిపెంట, ఆత్మకూరు ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు టీడీపీ నేతలు.

ఇక టీడీపీకి ధీటుగా మోస పూరితమైన పరిపాలన, వెన్నుపోటు దినోత్సవం, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు వైసీపీ నేతలు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఎవరి రాజకీయాలు వారు చేస్తూ తమ క్యాడర్లను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్తూన్నారు. అయితే రెండు పార్టీల్లో స్థానిక నేతల మధ్య కొన్నిచోట్ల పడటం లేదట. అయినా ఎవరికి వారే సమన్వయం చేసుకుంటూ పోటాపోటీగా రాజకీయాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. Srisailam TDP vs YSRCP

ఇక రెండు పార్టీల నేతలూ తమ ప్రచారంతో పాటు ఒకరికి మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారట. దీంతో శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు ఎటువైపు వెళ్లాయన్న సంగతి అర్థంకాని పరిస్తితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఎవరికి వారే సొంత బలం పెంచుకునేందుకు ఎదుటి పార్టీలో స్థానికంగా బలంగా ఉండే నేతలను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారట. ఈ పరిస్తితి దేనికి దారితీస్తుందోనన్న జనం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/former-minister-kondru-murali-sad-for-didnt-getting-a-ministerial-position-and-no-use-of-lokeshs-support/