
Munugode MLA Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తెల్చుకోవాలని డిసైడ్ అయ్యారా. మంత్రి పదవి కోసం మరొకసారి ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలకు కారణం అదేనా. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజ్ వార్నింగ్ ఇచ్చినా, రాజగోపాల్ రెడ్డి ఎందుకు లెక్కచేయడం లేదు. ఆయన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ఏం చేయబోతోంది. వాచ్ దిస్ స్టోరీ.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దన్న నిబంధన ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాన్ని క్రాస్ చేశారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంటరా లేదా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఆయనను పిలిచి మాట్లాడుతుందా, లేక నోటీసులు జారీ చేస్తారా అనే విషయంపై కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడుతున్నారట.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, ప్రతి పక్షాలపై విమర్శలు చేయడం మాని పాలనపై దృష్టి పెట్టాలన్న రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ప్రతిపక్షాలకు ఇచ్చినట్లు అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి పదవిపై కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్, నల్లగొండ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక మార్పులకు అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
తాను పదేళ్ల పాటు సీఎంగా ఉంటానన్న రేవంత్ రెడ్డి కామెంట్ మీద కూడా మునుగోడు ఎంఎల్ఏ విమర్శించారు. మూడేళ్ల తర్వాత ఎవరు సీఎం అవుతారో చూద్దామన్న ఆయన వ్యాఖ్యలు, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేసింది కేవలం రేవంత్ రెడ్డినే కాదనీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అన్న చర్చ మొదలైంది. అంతేకాదు, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమా అన్న అనుమానాలు ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లోనే మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. Munugode MLA Raj Gopal Reddy.
గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పార్టీ లైన్ దాటి చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించినప్పటికీ ఆయనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. వరంగల్ జిల్లాలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ పిలిచి మాట్లాడింది. ఆ తర్వాత ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతోంది. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పెద్దల రియాక్షన్ కోసం ఆసక్తిగా ఉన్నాయట.