నాగచైతన్య కి శోభిత కట్నం ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా..?

మెగా9 వెబ్ డెస్క్ :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీలోకి త్వరలో కొత్త కోడలు రాబోతోంది. ఈమధ్య కాలంలో అక్కినేని నాగచైతన్య , హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడి, చివరికి పెద్దలను ఒప్పించి, నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 8న బంధుమిత్రులు , స్నేహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ విషయంపై అక్కినేని కుటుంబం నుంచి కానీ శోభిత కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇకపోతే మరోవైపు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న అక్కినేని కుటుంబానికి , శోభిత ధూళిపాల కట్నం గా ఎంత తీసుకువెళ్తోంది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేని శోభిత ఎప్పుడైతే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుందో.. అప్పటినుంచి ఈమె పేరు భారీగా మారుమ్రోగుతోంది. ఇక పెళ్లి అనేసరికి ఎక్కడ చూసినా ఈమె గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కట్నం కింద ఎంత తీసుకొస్తుంది అంటూ వార్తలు రాగా.. ఈమె ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకురాకుండా కేవలం బంగారం మాత్రమే కట్నంగా తీసుకొస్తోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది

అయితే మరోవైపు అక్కినేని కుటుంబం తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా వేలకోట్ల ఆస్తులు ఉన్నా.. వైవాహిక జీవితంలో సంతోషం లేకపోతే అదంతా వృధా అవుతుంది. అందుకే కట్నం వద్దు తమ కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం

వీరి వివాహానికి హాజరు కాబోయే సెలబ్రిటీల విషయానికొస్తే..

దగ్గుబాటి కుటుంబం, మెగా ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ లకు ప్రత్యేక ఆహ్వానాలు అందించినట్లు సమాచారం. అటు బాలీవుడ్ నుండి రణ్బీర్ ఫ్యామిలీ , అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలకు, కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారట. రాజమౌళితోపాటు అల్లు కుటుంబానికి అలాగే పలువురు స్టార్ డైరెక్టర్లకు, నిర్మాతలకు, సినీ నటులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. ఇక వీరి వివాహం 22 ఎకరాలు కలిగిన అన్నపూర్ణ స్టూడియోలో చాలా ఘనంగా నిర్వహించనున్నారట . పెళ్లి కోసం భారీ సెట్టింగ్ కూడా రూపొందించినట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయాలపై పూర్తి క్లారిటి రావాలి అంటే అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.