రాష్ట్రంలో హెలీటూరిజం.!

Spread the love

Telangana Helitourism: తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహం రానుంది. రాష్ట్ర ప్రభుత్వం హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రెడీ చేసింది. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కలిసి హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించనుంది. ‘ఈజ్ మై ట్రిప్‌’ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మొదట వారాంతాల్లో సేవలు నడిపి, ప్రజల ఆదరణ బట్టి సేవలను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త రూపురేఖలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ సేవలు హైదరాబాద్‌- శ్రీశైలం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌ నల్లమల అడవులు, సోమశిల, అమరగిరి వంటి ప్రాంతాల అందాలను పై నుంచి చూపిస్తూ శ్రీశైలం చేరుకునేలా రూట్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్నందున, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతోంది. అయితే హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణిస్తే కేవలం గంటలోపే గమ్యం చేరుకోవచ్చు. దీంతో ఉద్యోగులు, కుటుంబాలు, అంతర్జాతీయ పర్యాటకులు వీకెండ్‌ ట్రిప్‌లకు సౌకర్యవంతంగా ఈ సేవలను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. Telangana Helitourism.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి హెలీ టూరిజంకు రూపకల్పన చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండు ప్రభుత్వాల సమన్వయంతోనే హెలీ టూరిజంను సక్సెస్ చేయబోతున్నారు. శ్రీశైలం ఏపీ ఆధీనంలో ఉండటంతో ఈ నిర్ణయంను తెలంగాణ తీసుకున్నట్లు సమాచారం. నల్లమల్ల అడ‌వుల మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమ‌శిల‌, అమరగిరి అందాలను చూసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే టూరిజం శాఖకు ఆదాయం పెరగనుంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q