
Balanagi Reddy Mantralayam constituency: గత కొన్నేళ్లుగా ఆ నియోజకవర్గంలో వైసిపి హవా కొనసాగుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో ఎన్ని పార్టీలు అక్కడ ప్రచారం చేసిన వైసిపి మాత్రమే గెలుస్తూ వస్తోంది.. వైసిపికి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసిపి నుంచి ఎవరు ఊహించని రీతిలో నాయకులు TDPలో జాయిన్ అయి వైసిపి నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఎక్కడ ఉంది. ఎందుకు నేతలు పార్టీ మారారో తెలుసుకో వాలంటే ఈ స్టోరీ చూడా ల్సిందే.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఇది. గత కొన్నేళ్లుగా వైసీపీకి ఈ నియోజకవర్గo కంచుకోటగా నిలుస్తోంది. ఎమ్మెల్యేగా వైసీపీ కి చెందిన బాల నాగిరెడ్డి కొనసాగుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బాలనా గిరెడ్డి ఈ ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం చేశారన్న ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భయంతో కొన్ని గ్రామాలు ఆయన వెంటే నడవాల్సిన పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బాలనా గిరెడ్డికి కంచుకోటగా ఉన్న ఈ ప్రాం తంలో టిడిపి పాగా వేసినట్లు తెలుస్తుంది. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామం లో 100 కుటుంబాలు మంత్రాలయం ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి నేతృత్వంలో స్థానిక నేతలు, మాజీ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం, స్థానిక ఎన్నికలే కారణాలని వారు తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా నియోజకవర్గంలో ఎవరూ పార్టీ మారిన సందర్భాలు లేవు. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా గ్రామాల్లో ప్రజలు ఇతర పార్టీలోకి చేరడం ఆసక్తి చూపుతున్నట్లు తెసుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా వైసిపిలో కొనసాగిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడానికి బలమైన కారణాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వైసిపి పాలనలో నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు వెళ్లాల్సిన పరిస్థితిలో నియోజకవర్గంలో నెలకొన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రాలయ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి కొంత మంది యువతకు ఉపాధి అవకాశా లు కల్పించడంతో ఇందుకు కారణమనే చెప్పాలి. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ ఇటీవల మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనానికి వచ్చిన సందర్భంలో మంత్రాలయం అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న విషయాలను స్థానిక ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీ మారితే గ్రామంలో అభివృద్ధి పనులు చేయించుకోవడంతో పిల్లలకు ఉపాధి కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో 100 కుటుంబాలు పార్టీ మారినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న బాల నాగిరెడ్డి నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినబడుతోంది. హైదరాబాదులో నివాసం ఉంటూ నియోజకవర్గానికి చుట్టం చూపుకు వచ్చి వెళ్తున్నారని కేడర్ అంత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగినప్పటికీ సరైన గుర్తింపు లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితోనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. Balanagi Reddy Mantralayam constituency.
ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఏళ్లుగా బాలనాగిరెడ్డి కనుసన్నల్లో కొనసాగిన కుటుంబాలు పార్టీ మారడంతో నియోజకవర్గంలో చర్చ కొనసాగుతోంది. వైసిపికి, ఎమ్మెల్యే బాలనాగ రెడ్డికి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని పొలిటికల్ సర్క్యూట్ లో చర్చ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో మరి కొంతమంది టీడీపీలో చేరే అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు వెళ్తున్న నేపథ్యంలో వైసిపి క్యాడర్ చేజారకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.